
వేల్పూర్‌లో ఉద్రిక్తత
మోర్తాడ్/వేల్పూర్ : ‘కనువిప్పు’ పేరిట కాంగ్రెస్, పరిచయం పేరిట బీఆర్‌ఎస్ పార్టీలు గురువారం చేపట్టిన కార్యక్రమాలు వేల్పూర్‌లో ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు బల ప్రదర్శనకు సిద్ధం కావడంతో పోలీసులు 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గల్ఫ్ వలస కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన రాష్ట్ర సహకార సంఘాల అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ మానా ల మోహన్‌రెడ్డి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలను ప్రశాంత్‌రెడ్డికి ఇంటికి తీసుకువస్తామని ప్రకటించారు. మానాల ప్రకటనకు స్పందించిన బీఆర్‌ఎస్ నాయకులు లబ్ధి పొందని వారితో వేల్పూర్‌లోని గాంధీ విగ్ర హం వద్ద నిరసన తెలుపుతామని వెల్లడించా రు. ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకుడు రేగుళ్ల రాములు, మరో నాయకుడు పోలీసుల కళ్లుగప్పి గాంధీ విగ్రహం వద్దకు వ చ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతలోనే పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వచ్చారు. పోలీసులు వారిని నిలువరించి స్టేషన్‌కు తరలించారు.
నాయకులను బయటకు పంపిన పోలీసులు
వేల్పూర్‌లో బల ప్రదర్శన కోసం వచ్చిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు బయటకు పంపించారు. వేల్పూర్‌లో ఉంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బల ప్రదర్శనకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల పోటాపోటీ
పలువురు నాయకులు, కార్యకర్తల అరెస్టు
163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు అమలు చేస్తూ పోలీసుల భారీ బందోబస్తు
ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లిన నంగి దేవేందర్‌రెడ్డి..
ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటివైపు కాంగ్రెస్ నాయకులెవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కో కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి ఒక్కరే పోలీసుల కళ్లుగప్పి ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. కొందరు నాయకులు ఆయనపై దాడి చేసి చొక్కా చింపారు. పోలీసులు కలుగజేసుకొని ఆయన్ని స్టేషన్‌కు తరలించారు.

వేల్పూర్‌లో ఉద్రిక్తత