
ప్రశాంత్‌రెడ్డి పతనం మొదలైంది
మోర్తాడ్/వేల్పూర్: బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పతనం మొదలైందని టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కో కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి అన్నారు. పదవులు ఎప్పటికీ శాశ్వతం కావని ఆయన చెప్పారు. గురువారం వేల్పూర్ పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకరులతో దేవేందర్‌రెడ్డి మాట్లాడారు. గల్ఫ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమం అమలు చేస్తుందో వివరించడానికి తాను ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న బీఆర్‌ఎస్ నాయకులను ఉసిగొలిపి దాడి చేయించారని ఆరోపించారు. గల్ఫ్ కార్మికుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. జిల్లాలో 55 మంది కుటుంబాలకు పరిహారం అందించినట్లు గుర్తు చేశారు. వేల్పూర్‌లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డిని స్వయంగా కలిసి వివరిస్తానని చెప్పారు.
టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కో కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి