నందిపేట్(ఆర్మూర్): మండలంలోని కంఠం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మూర్చవ్యాధితో మృతి చెందాడు. వివరాలు ఇలా.. గ్రామంలో గురువారం సుమారు 25ఏళ్ల నుంచి 30ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి కత్తెరలు సానబెట్టేందుకు వచ్చాడు. ఇంటింటికీ తిరుగుతూ కత్తెరలు సానబెడుతుండగా అకస్మాత్తుగా మూర్చవ్యాధి వచ్చి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
మోపాల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గుండ్యానాయక్ తండాకు చెందిన ప్రకాశ్ (40) గతంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి వచ్చాడు. కొన్నిరోజులుగా అతడి ఇంట్లో కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇటీవల ప్రకాశ్ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గురువారం పరిస్థితి విషమించి ప్రకాశ్ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మూర్చ వ్యాధితో గుర్తుతెలియని వ్యక్తి మృతి