
1962 యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
బోధన్‌రూరల్: పాడి రైతులు 1962 (భారత్ పశుదాన్) యాప్‌ను సద్వినియోగం చేసుకోవా లని పశుసంవర్ధక శాఖ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ ఎండీ అజారుద్దీన్ అన్నారు.మండలంలోని పలు గ్రామాల్లో గురువా రం ఆయన పర్యటించి, పశుసంవర్ధక శాఖ అధికారులు, గోపాల మిత్ర సభ్యులు అందిస్తున్న సేవల ను పరిశీలించారు. పాడి రైతులతో మాట్లాడి, గోపా ల మిత్ర, పశుసంవర్ధక శాఖ సేవలను ఆరా తీశా రు. పాడి రైతులు ప్రతి ఒక్కరూ 1962 (భారత్ పశుదాన్) యాప్‌లో తమ పశువుల వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూ చించారు. ఈ యాప్ ద్వారా పశువుల లింగనిర్ధారిత, కృతిమ గర్భాధారణ సిమెన్, ప్రభుత్వ వ్యాక్సినేషన్‌లు, పశువుల అమ్మకాలు, కొనుగొలు వంటి సేవలను పొందవచ్చన్నారు. గోపాల మిత్ర సభ్యులు ఆ రీఫ్, ఆజ్మత్, పాడి రైతులు పాల్గొన్నారు.