
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ సాయి చైతన్య అన్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కోవాలంటే ముందుస్తు వైద్య పరీక్షలతోనే గుర్తించి, చికిత్స తీసుకుంటేనే వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు. మాధవనగర్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో శుక్రవారం ‘క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగాం నిర్వహించారు. అలాగే అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వైద్య విద్యార్థుల కోసం రూపొందించిన ప్రత్యేక ఇంటర్‌షిప్ ప్రోగ్రాం ‘‘బ్రిడ్జింగ్ బోర్డర్స్’’ను ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ముందస్తు వైద్య పరీక్షలు మన జీవితాల నాణ్యతను పెంపొందించగలవన్నారు. అంకాలజీ వైద్యుడు చిన్నబాబు మాట్లాడుతూ.. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కమిషనర్ 8వ ఎడిషన్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్– 2025 పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీ రామ్ అయ్యర్, రచయిత, ప్రభుత్వ పాలసీ సలహాదారు వర్మ జంపానా, డాక్టర్ జీవన్‌రావు, ప్రతిమరాజ్ పాల్గొన్నారు.
ప్రశాంత్‌రెడ్డిని కలిసిన బిగాల
వేల్పూర్: హైదరాబాద్‌లో ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని శుక్రవారం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా కలిశారు. వేల్పూర్‌లో గురువారం ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడుల సంస్కృతికి తెరలేపవద్దన్నారు. ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: మైనార్టీ విద్యార్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని మై నార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనా న్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఉచిత శిక్షణ ఇస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమం హైదరాబాద్‌లో మాత్రమే ఉంటుందని తెలిపారు. డిగ్రీలో కనీసం 50శాతం మార్కులు, 26 సంవత్సరాలలోపు తక్కువ వయసు, తల్లిదండ్రుల ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలని పేర్కొన్నారు. వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను గూగుల్ ఫా రం ద్వారా సంబంధిత జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి
● డీఈవో అశోక్
డిచ్‌పల్లి: మారుతున్న కాలానికనుగుణంగా విద్యార్థులు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని డీఈవో అశోక్ సూచించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కాకతీయ సాండ్ బాక్స్ దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ ఇన్ విలేజ్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రైమరీ, హైస్కూల్ హెచ్‌ఎంలు సంధ్యనాయక్, సూర్యకుమారి, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, కాకతీయ సాండ్ బాక్స్ దేశ్‌పాండే ఫౌండేషన్ ప్రతినిధులు సాహితీ మేడూరి, మధు ఎడ్ల, గంగాప్రసాద్, భానుప్రసాద్, రూప, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి