మాక్లూర్: మండలంలోని మాణిక్‌భండార్ సమీపం నుంచి ప్రవహించే పులాంగ్ వాగు పూర్తిగా కలు షితమవుతోంది. దీంతో ఆ నీటిని సమీప గ్రామాల్లోని పశువులు తాగుతుండటంతో పశుపెంపకం దారులు ఆందోళళన చెందుతున్నారు. కలు షిత వాగు నీటిని పశువులు తాగి మృతి చెందే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
ఇదీ పరిస్థితి..
నిజామాబాద్ పులాంగ్ నుంచి మొదలైన వాగు మాక్లూర్ మండలంలోని మాణిక్‌భండార్, బొర్గాం(కె), కృష్ణనగర్, ముల్లంగి (బి), బొంకన్‌పల్లి, వల్లభాపూర్, జన్నేపల్లి, చిక్లి ద్వారా ప్రవహించి నవీపేట, నందిపేట మండలాల సరిహద్దులో ఉన్న గోదావరి నదిలో కలుస్తుంది. సుమారు 30 కిలోమీటర్ల పొడువునా ప్రవహించే ఈ వాగులో నగరంలోని మురుగుతోపాటు, సమీప గ్రామాల నుంచి వ్యర్థాలు చేరడంతో కలుషితమవుతోంది. అలాగే వాగు సమీపంలోని పలు రైస్‌మిల్లుల నుంచి కెమికల్స్‌ను వాగులోని వదలడంతో వాగు నీరంత విషపూరితంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు రాత్రి సమయాల్లో వ్యర్థాలను తెచ్చి ఆకుల కొండూర్, పూలాంగ్, జన్నేపల్లి వంతెనల వద్ద పారవేస్తుండటంతో నీరు మరింత కలుషితం అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. పొరపాటున వాగు నీటిని తాకితేనే శరీరం మొత్తం దద్దుర్లు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. అలాంటి నీటిని పశువులు తాగితే మృతిచెందే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వాగులో వ్యర్థాలు కలువకుండా, నీరు కలుషితం కాకుండ తగినచర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కలుషితమవుతున్న పులాంగ్ వాగు
ఆందోళన చెందుతున్న
పశుపెంపకందారులు
కలుషిత నీటిని ఇవ్వొద్దు
కెమికల్, వ్యర్థాలతో కూడిన నీరు పశువులు తాగటం వల్ల పాడిగేదె కడుపు అంత విషపూరితం అవుతుంది. మేత కూడ తినదు. పశువులను అట్టి కలుషిత నీరు తాగకుండా చూసుకోవటమే ఉత్తమం. వల్లభాపూర్‌లో కుర్మ బీరయ్య పాడి గేదె కలుషితనీరు తాగి మృతి చెందింది. ఆ గేదెకు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది.
– కిరణ్‌దేశ్‌పాండే, పశువైద్యాధికారి, మాక్లూర్
నా పాడి గేదె చనిపోయింది..
నాకు 10కి పైగా పాడిగేదెలు ఉన్నాయి. రోజూ పులాంగ్ వాగు పరిసర ప్రాంతాల్లోనే వాటిని మేపుతుంటాను. ఎంత దాహం వేసినా మురికి నీటిని గేదెలు తాగవు. కానీ రెండు నెలల క్రితం ఓ గేదె అధిక దాహంతో వాగులోని మురికి నీరు తాగి చనిపోయింది. అధికారులు స్పందించి, వాగును కలుషితం నుంచి కాపాడాలి.
– కుర్మ బీరయ్య, పశుపెంపకందారు, వల్లభాపూర్
మురుగునీరు.. కెమికల్ నురగలు..
మురుగునీరు.. కెమికల్ నురగలు..
మురుగునీరు.. కెమికల్ నురగలు..