
అహ్మదీ బజార్‌లో ఆక్రమణల తొలగింపు
ఖలీల్‌వాడి: నగరంలోని ఆహ్మదీబజారులోని శంభునిగుడి ప్రాంతంలో రోడ్డును అక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అంతకుముందు రోడ్డుపైన షాపులు, తోపుడు బండ్లను ఏర్పాటు చేస్తే వాహనాదారులకు ఇబ్బందులు ఏర్పడతాయని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ, సీఐ ప్రసాద్, సిబ్బంది దుకాణాదారులకు సూచించారు. అనంతరం ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈక్రమంలో అధికారులను కొందరు స్థానికులు చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షెహబాజ్, హర్షద్, మజీద్‌తోపాటు కొంత మంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే అదనపు బలగాలను పంపించి వారి చెదరగొట్టారు. రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఘటన స్థలానికి చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు రెండో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే కుమార్ గల్లీలోనూ రోడ్డుపై ఉన్న ఆక్రమణలను పోలీసులు తొలగించగా దుకాణాదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దుకాణాదారులతో అధికారులు మాట్లాడి, రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొలిగించారు.
అంతుచూస్తామంటూ పోలీసులకు
స్థానికుల బెదిరింపు

అహ్మదీ బజార్‌లో ఆక్రమణల తొలగింపు