చెక్కుచెదరని ఆనవాళ్లు | - | Sakshi
Sakshi News home page

చెక్కుచెదరని ఆనవాళ్లు

Sep 30 2023 12:52 AM | Updated on Sep 30 2023 12:52 AM

కల్యాణి చాళుక్యుల ఉమ్మెడ–1 శాసనం (ఇన్‌సెట్‌లో) పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం - Sakshi

కల్యాణి చాళుక్యుల ఉమ్మెడ–1 శాసనం (ఇన్‌సెట్‌లో) పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం

నిజామాబాద్‌

గోవిందా.. హరిగోవిందా..

జిల్లా కేంద్రంలో 14రోజులపాటు కొనసాగిన జెండాబాలాజీ ఆలయ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి.

శనివారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2023

– 8లో u

గోదావరి ఒడ్డున నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులో వేల సంవత్సరాల నాటి చారిత్రక ఆనవాళ్లు, దేవుళ్ల విగ్రహాలు, నాటి పాలకుల శాసనాలు చెక్కుచెదరకుండా ఠీవిగా దర్శనమిస్తున్నాయి. గోదావరి తీరంలో 4,500 ఏళ్లనాటి కొత్తరాతి యుగం ఆనవాళ్లతో పాటు వెయ్యేళ్ల క్రితం కల్యాణి చాళుక్యుల పాలనా కాలంలో వేసిన శాసనాలు నాటి జీవన విధానాన్ని తెలిపేవిధంగా ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. శ్రీరాంసాగర్‌ జలాశయం బ్యాక్‌వాటర్‌ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఉమ్మెడ గ్రామం సమీపంలోని మెరక ప్రాంతానికి మారింది. అయినప్పటికీ బ్యాక్‌వాటర్‌ సమీపంలో ఆనాటి చారిత్రక ఆనవాళ్లు నేటితరానికి పదిలమైన గుర్తులుగా ఉన్నాయి. ముంపు నేపథ్యంలో గ్రామం ఇక్కడి నుంచి తరలినప్పటికీ ప్రాచీనకాలంలో విలసిల్లిన నాగరికత చిహ్నాలు మాత్రం అనేక విశేషాలను తెలుపుతున్నాయి.

ప్రాచీన కాలంనాటి ఉమ్మెడ గ్రామంలో విలసిల్లిన ఉమామహేశ్వరాలయం సమీపంలోని ఈ ప్రాంతానికి వెళితే కాలభైరవ స్వామి ఆలయం దర్శనమిస్తుంది. దీనికి ముందుగా అరుదైన శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. రాతి స్తంభానికి నాలుగు వైపులా హునుమంతుని శిల్పాలతో పాటు ఆకాశం వైపు చూస్తున్న హనుమంతుని శిల్పం ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహం చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. ఇక కాలభైరవ స్వామి ఆలయంలో విగ్రహం ఠీవిగా దర్శనమిస్తుంది. అదేవిధంగా కాలభైరవ స్వామి ఆలయ ప్రాంగణంలో మరో హనుమంతుడి శిల్పం, ఆలయం బయట కుడివైపున ఇంకొక హనుమంతుడి శిల్పం రాతికి చెక్కి ఉన్నాయి. పక్కనే నాగదేవత విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నాగబంధం ఉందని ఉమ్మెడ గ్రామస్తులు భావిస్తున్నారు. కాలభైరవ స్వామి ఆలయం వెనుక భాగంలో 1008–1014 సంవత్సరాల మధ్య కల్యాణి చాళుక్యుల పాలకుడు 5వ త్రిభువనమల్ల విక్రమాదిత్య వేయించిన శాసనం, దానికి సమీపంలో 1017 సంవత్సరంలో 1వ జగదేకమల్లు వేయించిన శాసనం ఉన్నాయి. వీటి పక్కన నాటి కాలంలో చదునైన పెద్ద రాతిపై గీసిన దీర్ఘచతురస్రాకారంలోని గీతలు, మధ్యలో గుంట, పాము పడగ, దానికి సమాంతరంగా పేర్చి ఉన్న రాళ్లపై సర్పం బొమ్మలు చెక్కి ఉన్నాయి. తరువాత వీటికి వెనుక భాగంలో జైనుల శైలి గణపతి విగ్రహం దర్శనమిస్తోంది. శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ ఉన్న ఈ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్న తమ ప్రాంతాన్ని పురాతత్వ పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఉమ్మెడ గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామస్తులే ఈ ప్రాంతాన్ని సంరక్షించుకుంటున్నా రు. ఇక్కడ ఎవ్వరూ మద్యం సేవించకూడదని సూచిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇటీవలే చరిత్రకాలరులను ఇక్కడికి తీసుకొచ్చిన గ్రామస్తులు కొత్తరాతియుగం ఆనవాళ్లను, కల్యాణి చాళుక్యుల శాసనాలను డీకోడ్‌ చేయించడం ఉమ్మెడ గ్రామస్తుల బలమైన ఆకాంక్షకు నిదర్శనం.

నాగదేవత విగ్రహం

కాలభైరవ స్వామి విగ్రహం

న్యూస్‌రీల్‌

ఉమ్మెడ శివారులో సజీవంగా

నిలిచిన చారిత్రక సాక్ష్యాలు

శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ నేపథ్యంలో

గ్రామం తరలినప్పటికీ

పదిలంగా గుర్తులు

చారిత్రక పర్యాటక కేంద్రంగా

అభివృద్ధి చేయాలంటున్న గ్రామస్తులు

గోదావరి తీరంలో 4,500 ఏళ్లనాటి కొత్తరాతి యుగం ఆనవాళ్లు, వెయ్యేళ్ల క్రితం కల్యాణి చాళుక్యుల పాలనాకాలంలో వేసిన శాసనాలు ఉమ్మెడ గ్రామ శివారులో నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. గ్రామస్తులు చారిత్రకారులను ఇక్కడికి తీసుకొచ్చి శాసనాలను డీకోడ్‌ చేయిస్తున్నారు. అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్న తమ ప్రాంతాన్ని పురాతత్వ పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.

– సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌

1
1/9

జైనుల శైలి గణపతి విగ్రహం2
2/9

జైనుల శైలి గణపతి విగ్రహం

కాలభైరవ స్వామి ఆలయం పక్కన 
హనుమాన్‌ విగ్రహం3
3/9

కాలభైరవ స్వామి ఆలయం పక్కన హనుమాన్‌ విగ్రహం

ఆలయ ప్రాంగణంలో హనుమంతుడి విగ్రహం4
4/9

ఆలయ ప్రాంగణంలో హనుమంతుడి విగ్రహం

చదునైన రాతిపై చారిత్రక గుర్తులు5
5/9

చదునైన రాతిపై చారిత్రక గుర్తులు

6
6/9

7
7/9

8
8/9

9
9/9

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement