నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకటమాధవరావు, డీఆర్వో రాథోడ్ రమేశ్ తదితరులు పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది వివిధ శాఖల అధికారులతో కలిసి భారత రాజ్యాంగ పీఠికను ఆలపించారు. రా జ్యాంగ పరిరక్షణకు, దేశ సమైక్యతకు కట్టుబడి ఉంటామని అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలోనూ, దేశంలోని ప్రతీ పౌరుడికి సమాన హక్కులు, న్యాయం అందించడంలోనూ భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాజ్యాంగ రూపకర్తల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


