నిర్మల్‌చైన్‌గేట్: యువతను మత్తుపదార్థాల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన ’నషా ముక్త్ భారత్ అభియాన్’(డ్రగ్స్ రహిత భార త్) ప్రచార పోస్టర్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ భవేష్‌మిశ్రా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ గొజ్జ జనార్ధన్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసలు కాకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. వారిలో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మేనేజింగ్ కమిటీ కార్యదర్శి సత్యనారాయణ, వైస్ చైర్మన్ ఎంసీ.లింగన్న, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు సామనపల్లి రాఘవులు, జిల్లా కమిటీ సభ్యులు అయ్యన్నగారి భూమయ్య, మంచిరాల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


