నిర్మల్‌చైన్‌గేట్: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ రాజేందర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బందితో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై గురువారం సమీక్ష నిర్వహించారు. సాధారణ ప్రసవాలతో కలిగే ప్రయోజనాలు, అనవసరమైన సిజేరియన్ ప్రసవాలతో ఎదురయ్యే నష్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. గర్భధారణ ప్రారంభ దశ నుంచే కౌన్సెలింగ్ నిర్వహించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెంచేందుకు వైద్య సిబ్బంది అంతా సమష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) వారీగా వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డాక్టర్ నయనారెడ్డి, డాక్టర్ రాకేశ్, డాక్టర్ పవన్, డాక్టర్ సౌమ్య, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, జిల్లా డేటా మేనేజర్ గంగాధర్ పలువురు వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలు పెంచాలి
గర్భిణులకు సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని డీఎంహెచ్‌వో రాజేందర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆస్పత్రిని గురువా రం సందర్శించారు. ఆస్పత్రిలోని గర్భిణుల నమో దు కేంద్రంతోపాటు, సుఖ ప్రసవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాయామ కేంద్రాన్ని పరిశీ లించారు. అనంతరం ప్రసవాల గణాంకాలు, అంది స్తున్న వైద్య సేవల వివరాలను విభా గాధిపతి (హెచ్‌ఓడీ)డాక్టర్ సరోజ, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన గర్భిణులతో డీఎంహెచ్‌వో మాట్లావారు. సాధారణ ప్రసవాలతో తల్లీబిడ్డలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ నిఖిత, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, సీనియర్ నర్సింగ్ అధికారి జన, కార్యాలయ అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు.


