ప్రజావాణి అర్జీలు పెండింగ్‌ పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలు పెండింగ్‌ పెట్టొద్దు

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

● కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలన్నారు. ప్రజావాణికి విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలపై 85 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో ఇన్‌చార్జి అడిషనల్‌ కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement