నిర్మల్‌చైన్‌గేట్: వివిధ కారణాలతో అనాథలైన పిల్లలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయినవారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, రక్షణ లేని పిల్లలకు మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవద్ధుల సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ పథకంలో పిల్లలకు నెలకు రూ.4 వేల చొప్పున ఆర్థికసాయం అందుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ72 వేలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారి వార్షిక ఆదాయం రూ.96 వేలకు మించకూడదని వివరించారు. దరఖాస్తు ఫారం, వివరాలు nirmal. telangana. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను గొల్లపేటలోని బాల రక్ష భవన్ ఆఫీసులో సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9966696464 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


