న్యూస్‌రీల్
జగజ్జననీ నమోస్తుతే
నిర్మల్ పట్టణ శివారు గండిరామన్న ప్రాంతంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 25 ఏళ్ల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిశారు.
– 09లో
ఎండిపోతున్న పొలంలో నిలబడిన ఈ రైతు పేరు కంకల్ల చిన్న గంగారాం. లక్ష్మణచాంద మండలం పార్‌పెల్లిలో సరస్వతి కాలువ కింద రెండెకరాల్లో వరి వేశాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు పెట్టుబడి పెట్టాడు. పంట పొట్ట దశకు వచ్చిన తర్వాత నీరందక పంట ఎండుతోంది. వారబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తున్నా చి‘వరి’కి అందడం లేదు. దీంతో రెండెరాల పొలం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ యువ రైతు పేరు దినేష్. లక్ష్మణ చాంద మండలం పార్‌పల్లికి చెందిన ఈయన రూ.22,500 పెట్టుబడి పెట్టి ఎకరంనరలో వరి సాగు చేశాడు. సరస్వతీ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీళ్లు అందడం లేదు. బోర్లు, బావుల్లో నీరు లేదు. దీంతో పంట పూర్తిగా ఎండిపోతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.


