నిర్మల్‌టౌన్: ఈ నెల 5న జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లాన్‌పై జూపల్లితో చర్చించారు. పట్టణ భవిష్యత్ అభివృద్ధి, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. మాస్టర్ ప్లాన్‌తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పట్టణ సమగ్ర అభివృద్ధికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇందులో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమందు ఆలీ ఉన్నారు.


