నిర్మల్‌టౌన్: సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. ‘ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి’ అనే సూత్రాన్ని పాటిస్తే సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని తెలిపారు. జాతీయ సైబర్ భద్రత అవగా హన మాసం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ నేరాలపై రూపొందించిన అవగా హన పోస్టర్లు మంగళవారం ఆవిష్కరించారు. సైబ ర్ మోసానికిగురైతే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎస్సైలు శ్రావణి, ముత్యం పాల్గొన్నారు.


