లోకేశ్వరం: మండలంలోని పోట్‌పల్లి(బి)గ్రామ పంచాయతీ పరిధిలోని ఎడ్దూర్ పేరిట రేషన్ షాప్ ఉంది. ఇందులో పోట్‌పల్లి(బి)లో 237 రేషన్ కార్డులు, ఎడ్దూర్ గ్రామంలో 196 రేషన్ కార్డులు ఉన్నాయి. మంగళవారం డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వీటిని పరిశీలించగా కార్డుపై పోట్‌పల్లి(బి)గ్రామానికి చెందిన వారికి కూడా ఎడ్దూర్ అని ఉంది. దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కార్డులను పంపిణీ నిలిపివేసి సరి చేసిన తరువాత పంపిణీ చేయాలని అధికారులకు తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ సూర్యరావును వివరణ కోరగా డిజిటల్ రేషన్ కార్డులపై తప్పులు ఉండే వాటిని ఉన్నతాధికారులకు నివేదించి సరిచేస్తామని చెప్పారు.


