ఖానాపూర్: ఖానాపూర్ కోర్టు నూతన ఇన్‌చార్జి జడ్జిగా నియమితులైన బి.నిఖితకు బార్ అసో సియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖితను సన్మానించారు. అదే సమయంలో బదిలీపై వెళ్తున్న జడ్జి భవిష్యకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. కోర్టు విధుల్లో ఆమె అందించిన సేవలు, న్యాయవాదులకు అందించిన సహకారాన్ని స్మరించుకుంటూ అభినందనలు తెలి పారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్, కార్యదర్శి బాశెట్టి శివ, సీనియర్ న్యాయవాది వెంకట మహేంద్ర, సళ్ల ప్రశాంత్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు షబ్బీర్ పాషా, నరేంద్రనాథ్, షేక్ కదిర్, రాసమల్ల అశోక్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.


