అర్హులు ఓటుహక్కు కోల్పోవద్దు | - | Sakshi
Sakshi News home page

అర్హులు ఓటుహక్కు కోల్పోవద్దు

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టీకే.శ్రీదేవి

నిర్మల్‌చైన్‌గేట్‌: అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టీకే.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఓటు హక్కు దుర్వినియోగాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో.. అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడటం అంతే ముఖ్యమన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సంతప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్‌, అధికారులు, సహకరిస్తున్న రాజకీయ పార్టీల ప్రతినిధులను అభినందించారు. బీఎల్‌వోలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ధ్రువపత్రాల పరిశీలించాలని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లకు సంబంధించిన కారణాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని కస్బా పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై స్థానిక బీఎల్‌వోలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్ల నుంచి సేకరించిన ధ్రువపత్రాల పరిశీలన, ఫారాల పరిష్కారం తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) రాథోడ్‌ రమేశ్‌, భైంసా, ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్లు అజ్మీరా సంకేత్‌కుమార్‌, ప్రణయ్‌కుమార్‌, ఆర్డీవో దేవీదాస్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement