నిర్మల్‌చైన్‌గేట్: గోదావరి పుష్కరాల పనులు గడువులోపు పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రెటరీ శైలజా రామయ్యర్ కలెక్టర్లను ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి హైదరాబాదు నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల పనులు కలెక్టర్లు, నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పుష్కరాల పనులపై పలు కీలక సూచనలు చేశారు. పనులు పూర్తి చేయడానికి గడువు నిర్ణయించుకుని, ఆలోగా పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులకు ఇసుక కొ రత తలెత్తకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నా రు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఈ వీడి యో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ భవేశ్ మిశ్రా, నీటిపారుదల ఆర్‌అండ్‌బీ, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖ అధికారులు సుభాష్, అనిల్, సందీప్ పాల్గొన్నారు.
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
జిల్లాలో భూసమస్యలకు సంబంధించి అన్ని దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూసంబంధిత దరఖాస్తుల పరిష్కారం, భూముల రీసర్వేపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సులు, సదాబైనమా, దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందం మొత్తం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాథోడ్ రమేశ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ రాకేశ్, ఆర్డీవో దేవీదాస్, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.
యథావిధిగా ప్రజావాణి
జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నప్పటికీ సోమవారం నాటి ’ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ భవిశ్ మిశ్రా తెలిపారు. అర్జీలను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.


