ఖానాపూర్: ఆషాఢ మాసం పురస్కరించుకుని పట్టణంలోని శ్రీవీరాంజనేయ శివసాయి సమాజ్ ఆధ్వర్యంలో జంగల్ హనుమాన్ ఆలయంలో ఆదివారం గోరింటా పండుగ నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి గోరింటాకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రవీందర్‌రావు సతీమణి ఉమాదేవి, 10వ వార్డు కౌన్సిలర్ బండిపెల్లి సిందూజ ప్ర త్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆ లయ కమిటీ అధ్యక్షుడు కొక్కుల ప్రదీప్, కమి టీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.


