ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత కొనసాగుతాయి. రాత్రి చలి ప్రభావం ఉండదు.
జిల్లా జడ్జిని కలిసిన బార్ అధ్యక్షుడు
ఖానాపూర్: ఖానాపూర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు చాంబర్‌లో జిల్లా జడ్జి శ్రీవాణిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖానాపూర్‌లో సొంత కోర్టు భవన నిర్మాణంపై విన్నవించారు. స్పందించిన జడ్జి త్వరలో వచ్చి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏజీపీ ఆసిఫ్ అలీ, న్యాయవాదులు వెంకట్ మహేంద్ర, చిన్నం సత్యం, బక్కశెట్టి కిశోర్, ఫారూఖ్ అహ్మద్, బాశెట్టి శివ, షబ్బీర్ పాషా, రాసమల్ల అశోక్ తదితరులు ఉన్నారు.


