● అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
కుంటాల: ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలను సోమవారం సందర్శించారు. ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం అందకూర్ నర్సరీని పరిశీలించారు. వేసవి నేపథ్యంలో మొక్కలు వాడిపోకుండా చూడాలన్నారు. ఆయన వెంట డీఈవో భోజన్న, తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, ఏపీవో గట్టుపల్లి నవీన్ ఉన్నారు.


