‘ప్రజా’సమస్యలు పెండింగ్‌లో పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

‘ప్రజా’సమస్యలు పెండింగ్‌లో పెట్టొద్దు

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) కిశోర్‌కుమార్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను సమర్పించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలన్నారు. ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement