నిర్మల్‌టౌన్/భైంసాటౌన్: హజ్ యాత్రకు వెళ్లేవారు కచ్చితంగా వాక్సిన్ తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి అన్నారు. నిర్మల్‌లోని ఐఏ ఫంక్షన్ హాల్‌లో ఖాదిముల్ ముజాజ్ హజ్ సొసైటీ, బైంసా ఏరియా ఆస్పత్రిలో సోమవారం వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించారు. నిర్మల్‌లోని శిబిరాన్ని గణేశ్ చక్రవర్తి ప్రారంభించారు. యాత్రకు వెళ్లినవారు క్షేమంగా వెళ్లి రావాలని కోరారు. భైంసా పట్టణంతోపాటు డివిజన్ పరిధిలోని 48 మంది హజ్ యాత్రికులకు వైద్యులు ఆరో గ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వ్యాక్సి న్ వేశారు. యాత్రలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు రఫీ, మతీన్, డీసీహెచ్ కాశీనాథ్, డాక్టర్లు, మైనార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


