మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026 8లోu ● గతేడాది ఏప్రిల్‌లో జిల్లాకేంద్రంలోని బంగల్‌పేట్ చెరువుకట్టపై అభిషేక్ అనే యువకుడు తన మిత్రుడితో కలిసి వెళ్తుండగా, మరో యువకుడు వేగంగా బైక్‌పై వచ్చి వారిని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో అభిషేక్ దుర్మరణం చెందాడు. ప్రమాదానికి కారకుడైన యువకుడు గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ● జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఎదుటే గంజాయి సేవించి ఉన్న ఇద్దరు యువకులు నేరుగా వచ్చి బైకుతో ఢీకొట్టడంతో రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వర్ తీవ్రగాయాలతో మృతిచెందాడు. ● జిల్లాకేంద్రంలో ఆరు నెలలక్రితం నలుగురు యువకుల మధ్య జరిగిన గొడవలో ఒకరు సీసా పగలగొట్టి, తన మిత్రుడు గొంతుభాగంలోనే పొడిచాడు. బాధితుడూ తప్పించుకో లేదు. పక్కనున్న మిత్రులూ ఆప లేదు. ఎందుకంటే.. వాళ్లంతా గంజాయి మత్తులో ఉన్నారు. వారేం చేస్తున్నారో.. వారికే తెలియ లేదు. ● ఓ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతున్నట్లు అనుమానం వచ్చి పరిశీలించగా, మత్తుమందుతో చుట్టిన సిగరెట్లు దొరికాయి.
న్యూస్‌రీల్
‘మా ట్రాక్ స్పీడ్ పెంచండి..’
ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణం వేగంగా పూర్తిచేసేలా చూడాలని వైఎస్సార్ సీపీ ఎంపీ సిర్గాపూర్ నిరంజన్‌రెడ్డి కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కోరారు.
అవార్డులే పనితీరుకు కొలమానం
నిర్మల్‌చైన్‌గేట్: అవార్డులు పనితీరుకు కొలమానమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవలే జిల్లాకు మూడు స్కోచ్ అవార్డులు రావడంతో కలెక్టర్ అభిలాష అభినవ్ డీఎంహెచ్‌వో రాజేందర్, ఖనాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మంత్రిని హైదరాబాద్‌లో కలిశారు. స్కోచ్ అవార్డులు లభించడం ఎంతో గర్వకారణం అని మంత్రి ప్రశంసించారు. పొనికివనం ఏర్పాటు, అమ్మ రక్షిత కార్యక్రమం అమలు విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు అధికారులను మెచ్చుకున్నారు. జిల్లాలో వినూత్న కార్యక్రమాలు అమలుచేసేలా ప్రోత్సాహం అందిస్తూ, మార్గ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రికి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో డీఆర్డీవో విజయలక్ష్మి కూడా ఉన్నారు.
నిర్మల్: జిల్లాకేంద్రంలోని సోఫీనగర్‌కు చెందిన ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్ప డిన నిందితులు గంజాయి వాడినట్లు తేలడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా మొత్తం గంజాయి గుప్పిట్లోకి వెళ్లిపోతున్నా.. నేరాలు ఘోరాలు పెరుగుతున్నా.. అరికట్టాల్సిన శాఖలు ఏ‘మత్తు’లో ఉన్నాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి ‘డ్రగ్స్ ఫ్రీ నిర్మల్’ అంటూ కార్యక్రమాలు చేసే జిల్లా అధికారులు ఆ తర్వాత క్షేత్రస్థాయిలో గంజాయి నిషేధాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగుతున్నా.. సంబంధిత ఎకై ్సజ్, పోలీసుశాఖలు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలూ వస్తున్నాయి.
గంజాయి మత్తులో నేరాలు..
జిల్లాలో గంజాయి మత్తులో నేరాలు, ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బడి ఈడులోనే కొంతమంది పిల్లలు ఈ మహమ్మారికి బానిసై, తామేం చేస్తున్నామో తెలియని మత్తులో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరొకరి జీవితాన్నీ నాశనం చేస్తున్నారు.
ఇవే కాకుండా.. జిల్లాకేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్/ఎక్స్‌రే టెక్నీషియన్‌లు, ఓ యువకుడు శస్త్రచికిత్సల సమయంలో పేషెంట్లకు ఇచ్చే మిడాజోలం అనే మత్తుమందు ఇంజక్షన్లను యువతకు ఇస్తూ పట్టుబడ్డారు. ఇలా గంజాయి మత్తులో నేరాలు పెరుగుతూనే ఉన్నాయి.
‘మత్తు’లో ఉన్నాయా..!?
ఇటీవల ఘటనల నేపథ్యంలో మత్తుపదార్థాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్, పోలీస్‌శాఖల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల ‘మత్తు’లో సదరుశాఖలు క్షేత్రస్థాయిలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నో కేసులు ఛేదించే పోలీసులు, ఎకై ్కజ్ అధికారులకు ఎక్కడి నుంచి గంజాయి వస్తోంది, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు తదితర వివరాలు తెలియవా..!? అని జిల్లావాసులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ నిర్మల్’, ‘నో డ్రగ్స్..’ అని చెప్పే జిల్లా అధికారులు జిల్లాలో ఇంతలా గంజాయి గుప్పుమంటున్నా పట్టించుకోవడం లేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడే స్పందిస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికై నా భావితరం నాశనం కాకుండా, మత్తుపదార్థాల ఊబిలో జిల్లా కూరుకుపోకుండా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు.


