ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీ పర్ధాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గేడం తులసీరాం (ఆదిలాబాద్), గౌరవ అధ్యక్షుడిగా కుర్సేంగే జంగు (మంచిర్యాల), ప్రధాన కార్యదర్శిగా ఆడ వెంకటేశ్ (కుమురం భీం ఆసిఫాబాద్), కోశాధికారిగా ఉయికే విఠల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మడావి శంకర్, ఆడిటర్‌గా గేడం కృష్ణ, సాంస్కృతిక కార్యదర్శిగా తొడసం నాగోరావు, ఉపాధ్యక్షులుగా మనోహర్, గంగాసాగర్, అంజనాదేవి, గంగారాం, కుమ్ర శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా మడావి తిరుపతి, కుమ్ర గంగారం, ఆత్రం ప్రహ్లాద్, కుర్సేంగే మహేందర్, మడావి హరిప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులుగా కోవా వినోద్, కోట్నాక భగవంతురావు, మెస్రం దేవరావు, కుర్సేంగే శంకర్ ఎన్నికయ్యారు.


