అగ్నివీర్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

అగ్నివీర్‌పై అవగాహన

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

నిర్మల్‌ఖిల్లా: దేశసేవ చేయడానికి అగ్నివీర్‌ తోడ్పడుతుందని, అవకాశమున్న యువత, విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నించి సేవచేయాలని పలువురు వక్తలు అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నివీర్‌, వివిధ పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ యు.గంగాధర్‌, కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ కె.రమేశ్‌, అధ్యాపకులు శ్రీనివాస్‌, సుభాష్‌, ఉమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement