● షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఖానాపూర్: కోరం లేక రెండు సార్లు వాయిదా పడిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈ నెల 4న నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఖానాపూర్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ సుందర్‌సింగ్ తెలిపారు. ఏప్రిల్ 2లోపు ప్రత్యేక సమావేశానికి సంబంధించిన నోటీసులు జారీ చేస్తారు. ఏప్రిల్ 4న ఉదయం 11 గంటలకు వార్డు స భ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. చైర్మన్ ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో 4న ఎన్నికలు జరగకపోతే, మరుసటి రోజు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.
108 సిబ్బందికి ఉత్తమ పురస్కారాలు
ఇచ్చోడ: మండలంలో 108 సిబ్బంది ఈఎంటీ ప్యాట అనిల్‌కుమార్, పైలట్ సింగారం వినోద్‌లకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు లభించాయి. ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందజేసి సకాలంలో ఆస్పత్రులకు తరలించి పలువురు ప్రాణాలు కాపాడినందుకు హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారా లు అందజేశారు. రాష్ట్రస్థాయిలో ఇచ్చోడ సిబ్బంది పురస్కారాలు అందుకోవడంపై మండల ప్రజలు అభినందించారు.
గవర్నర్‌ను కలిసిన ‘సొసైటీ’ సభ్యుడు
పాతమంచిర్యాల: రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మధుసూదన్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో మధుసూదన్‌రెడ్డి


