మా ట్రాక్‌ స్పీడ్‌ పెంచండి.. | - | Sakshi
Sakshi News home page

మా ట్రాక్‌ స్పీడ్‌ పెంచండి..

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

● ప్రస్తుతంహైదరాబాద్‌–నిజామాబాద్‌–ముథ్కెడ్‌–ఆదిలాబాద్‌ మీదుగా వెళ్తున్న రైల్వేలైన్‌తో అనవసరంగా 120 కి.మీ. చుట్టూ తిరగాల్సి వస్తోంది. ● ఈప్రాంత రైతులు పండించే పత్తి, సోయాబీన్‌, ఎర్రజొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు తదితర పంటలకు మరింత మార్కెట్‌ లభిస్తుంది. ● వ్యవసాయ, పాడి, పర్యాటక రంగాల అభివృద్ధికి ఈ లైన్‌ ఓ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ● హైదరాబాద్‌–ఢిల్లీ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 4 గంటల వరకు తగ్గిస్తుంది. ● అలాగే ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌ 44పైనా సరుకు రవాణా వాహనాల రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఈ లైన్‌ నిర్మాణంతో ఎన్నో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.

2011లో సర్వే చేసినప్పుడు రూ.1,699.98 కోట్లతో 136 కి.మీ. లైన్‌ నిర్మించాలని ప్రతిపాదించారు.

2017–18లో రూ.12,720 కోట్ల అంచనా వ్యయం కాగా రాష్ట్రం–కేంద్రం జాయింట్‌ వెంచర్‌గా నిర్మాణానికి ముందుకు వచ్చారు. కానీ ఎంఓయూ కాకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయింది.

2023లో సంయుక్త సర్వే చేసి రూ.13,646 కోట్లతో 135.42 కి.మీ. లైన్‌ నిర్మించాలని సూచించారు.

2025లో రూ.3 వేల కోట్లతో 137కి.మీ. లైన్‌ నిర్మాణానికి అలైన్‌మెంట్‌ ఖరారైంది.

ప్రస్తుతం ఈ లైన్‌ నిర్మాణానికి సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) పూర్తిగా సిద్ధమై, వివిధ దశలు పూర్తిచేసుకుని, రైల్వేబోర్డు ఆమోదం కోసం వేచి ఉంది.. అని కేంద్రమంత్రికి తన ప్రజెంటేషన్‌లో ఎంపీ నిరంజన్‌రెడ్డి వివరించారు. ఇందుకు అశ్వినీవైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారని ‘సాక్షి’తో ఫోన్‌లో పేర్కొన్నారు.

‘ఆర్మూర్‌–నిర్మల్‌–ఆదిలాబాద్‌’ లైన్‌ వ్యూహాత్మక అవసరం రాజ్యసభ ఎంపీ నిరంజన్‌రెడ్డి కేంద్ర రైల్వే మంత్రికి ప్రజెంటేషన్‌ అశ్వినీవైష్ణవ్‌ సానుకూల స్పందన

ప్రస్తుతం కాజీపేట–మంచిర్యాల–బల్హర్షా మీదుగా సాగుతున్న గ్రాండ్‌ట్రంక్‌ రైల్వేలైన్‌ వందశాతం సామర్థ్యానికి మించి పనిచేస్తోంది. సరుకు రవాణాకు ఇబ్బంది ఏర్పడుతోంది. నిర్మల్‌ మీదుగా లైన్‌ వేయడంతో ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.

ఆర్మూర్‌–నిర్మల్‌–ఆదిలాబాద్‌ లైన్‌ నిర్మాణంతో ఉత్తర తెలంగాణలోని దాదాపు 7 లక్షల మందిని రైల్వేసేవలు అందుబాటులోకి వస్తాయి. వెనుకబడిన ఈప్రాంతంలో అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి.

నిర్మల్‌: నాగ్‌పూర్‌–హైదరాబాద్‌ మధ్య దూరాన్ని తగ్గించడంతోపాటు, దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే వ్యూహాత్మక రైల్వేలైన్‌గా ఆర్మూర్‌–నిర్మల్‌–ఆదిలాబాద్‌ లైన్‌ నిలుస్తుందని, సంబంధిత రైల్వేలైన్‌ నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసేలా చూడాలని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు, జిల్లావాసి సిర్గాపూర్‌ నిరంజన్‌రెడ్డి కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిశారు. ఆర్మూర్‌–నిర్మల్‌ మీదుగా కేవలం 137కి.మీ. రైల్వేలైన్‌ నిర్మించడంతో కలిగే ప్రయోజనాలు, నిర్మాణం చేపట్టాల్సిన అవశ్యకతపై పూర్తి వివరాలతో, వివరణాత్మకంగా ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

రైల్వేలైన్‌ ఎందుకంటే..

ఏళ్లుగా ఎదురుచూపులు..

నిర్మల్‌ మీదుగా రైల్వేలైన్‌ నిర్మాణం అనేది దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ అని, ప్రతీసారి కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తూ వస్తోందని ఎంపీ వివరించారు. ప్రతీసారి బడ్జెట్‌లో సర్వే చేస్తున్నారని, ఏడాదికేడాది ప్రతిపాదిత వ్యయం పెరుగుతోందని చెప్పారు.

తక్షణమే ప్రారంభించాలని కోరాం..

ఆర్మూర్‌–నిర్మల్‌–ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి సంబంధించి తక్షణమే ప్రాథమిక పనులు ప్రారంభించేందుకు, మొదటిదశకు రైల్వేబోర్డు నుంచి త్వరగా అనుమతి ఇవ్వడంతోపాటు బడ్జెట్‌ కేటాంచాలని ప్రజెంటేషన్‌లో కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కోరాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం రైల్వేబోర్డు దగ్గర ఉందని, త్వరగా పూర్తయ్యేలా తాను చూస్తానని ఆయన చెప్పారు. –సిర్గాపూర్‌ నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement