లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నెన్నెల మండల కేంద్రానికి చెందిన అల్లంపల్లి సంతోష్ హనుమాన్ దీక్ష విరమణ కోసం ఆదివారం కాలినడకన జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరాడు. మార్గమధ్యలో రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


