సత్వర న్యాయం అందించాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం జరి గేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరై భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామా ల నుంచి వచ్చిన ఏడుగురి నుంచి అర్జీలు స్వీకరించారు. వారి ఎదుటే సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. అనంతరం కు టుంబ వివాదాల పరిష్కారంలో భరోసా కేంద్రం కృషిని పరిశీలించారు. గత గ్రీవెన్స్‌లో వ చ్చిన ఫిర్యాదుల పరిష్కారస్థితి, పెండింగ్ ఫి ర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా ఉన్నారు.


