ఇంటికే మేడారం ప్రసాదం
నిర్మల్‌టౌన్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లలేని వారి కోసం ఆర్టీసీ వారు ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. నిర్మల్ బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి రూ.299కు ఇంటి వద్దకే మహాప్రసాదాన్ని కార్గో ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను బుధవారం నిర్మల్ డిపోలో మేనేజర్ పండరి ఆవిష్కరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నవీన్‌కుమార్, స్టేషన్ మేనేజర్ ఏఆర్ రెడ్డి, వీజీ రెడ్డి, కార్గో డీఎం కిశోర్‌కుమార్, కంట్రోలర్లు శేఖర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.


