నిర్మల్
న్యూస్‌రీల్
‘వసంత’ వేడుకలు ప్రారంభం
బాసర శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు.
డిప్యూటీ సీఎం భట్టిని
కలిసిన ఆదివాసీలు
కడెం: ఉట్నూర్ మండల పర్యటనకు బుధవా రం వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను రాజ్‌గోండ్ సేవా సమితి నాయకులు కలిశారు. మండలంలోని మారుమూల మి ద్దెచింత గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, రోడ్డు, అంగన్‌వాడీ భవనం నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, నాయకులు భీంరావు, ఆత్రం మానిక్‌రావు పటేల్, చిన్నుపటేల్, అశోక్, నాగోరావు, తిరుపతి, గోవిందరావు తదితరులున్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికను మహిళలే పోషించనున్నారు. ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే 4,244 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ మ హిళలకు సంక్షేమ పథకాల పేరిట పెద్దపీట వేస్తూ ప్రచారానికి సిద్ధమవుతుండగా, బీఆర్‌ఎస్, బీజేపీలు మహిళలను ఆకట్టుకుని ఓట్లు సంపాదించుకోవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి.
ఎన్నికల్లో సగం సీట్లూ వారికే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు 50శాతం సీట్లు కేటాయించారు. ఇవే కాకుండా మిగతా 50శాతం సీట్లలో జనరల్ స్థానాల్లో మ హిళలు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపోటముల ను ప్రభావితం చేస్తున్నారు. దీంతో వివిధ పార్టీల నాయకులు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తమ ప్రచార కార్యాచరణ చేపడుతున్నారు.
పతుల స్థానంలో సతులు..
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని భావించి పలువురు భంగపడిన విషయం తెలిసిందే. అలాంటి చోట తమ స్థానంలో భార్య లేదా కుటుంబంలోని మహిళను బరిలో ఉంచాలని భావిస్తున్నారు.
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా
మూడుచోట్ల వారిదే పైచేయి
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 1,67,015 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 81,372 మంది కాగా, మహిళా ఓటర్లు 85,616 మంది ఉన్నట్లు తేలింది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 4,244 మంది అధికంగా ఉన్నారు. దీంతో కౌన్సిలర్లు, చైర్మన్ బరిలో నిలువాలనుకునే వివిధ పార్టీల నాయకులు వారిని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ మహిళల కోసం ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తుండగా.. ఇది తమకు కలిసొస్తుందనే ఆశలో ఆ పార్టీ నాయకులున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున నిర్వహించే ప్రతీ సమావేశానికి మహిళా సంఘాల సభ్యులను ఆహ్వానిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న మెప్మా గ్రూపు సభ్యులకు ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తోంది. ప్రతీ మున్సిపాలిటీల్లో సుమారు 5వేల నుంచి 10వేలమంది మహిళా గ్రూపుల సభ్యులుంటారని అంచనా.
నిర్మల్ మున్సిపల్ కార్యాలయం
మున్సిపాలిటీల వారీగా ఓటర్లు
మున్సిపాలిటీ పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం
నిర్మల్ 47,362 50,824 18 98,204
భైంసా 25,486 25,623 9 51,118
ఖానాపూర్ 8,524 9,169 0 17,693
నిర్మల్
నిర్మల్
నిర్మల్


