నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jan 20 2026 7:35 AM | Updated on Jan 20 2026 7:35 AM

నిర్మ

నిర్మల్‌

● నేటి నుంచి 25 వరకు గణన ● 60 మంది వలంటీర్ల నియామకం ● ప్రత్యేక యాప్‌లో డేటా అప్‌లోడ్‌ మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

తేలనున్న వన్యప్రాణుల లెక్క

రూ.2.7 కోట్ల చెక్కు అందజేత

నిర్మల్‌టౌన్‌: మహిళా శక్తి సంబురాల్లో భాగంగా పట్టణానికి చెందిన మహిళా స్వయం సహాయ సంఘాలకు రూ.2.72 కోట్ల చెక్కును నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఎమెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌ సోమవారం అందజేశారు. మహిళలు వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు.

నిర్మల్‌టౌన్‌: జిల్లా వన్యప్రాణుల గణన ఈనెల 20(మంగళవారం) నుంచి 25వ తేదీ వరకు జరుగనుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వన్యప్రాణులను లెక్కించున్నారు. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఆదేశాల ప్రకారం నాలుగేళ్లకు ఒకసారి ఈ గణన చేపడుతున్నారు. ఈసారి గణన కచ్చితంగా నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది.

శాకాహార, మాంసాహార

జంతువుల గుర్తింపు..

సర్వేలో శాకాహార, మాంసాహార జంతువులను ప్రత్యక్షంగా లెక్కిస్తారు. చిరుతలు, పులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు, నక్కలు, కొండ గొర్రెలు, దుప్పులు, చుక్కల దుప్పులు, కృష్ణ జింకలు, కుందేళ్లు, నెమళ్లు, అడవికోళ్లు వంటి జంతువులు లెక్కించనున్నారు. శాకాహార జంతువుల లెక్కింపు కోసం ప్రతీ బీట్‌లో 2 కి. మీ ట్రాన్సెక్ట్‌ లైన్‌లు ఏర్పాటు చేస్తారు. మూడు రోజులు రోజుకు 2 కి. మీ చొప్పున పాటిస్తారు. మాంసాహార జంతువల గణన కోసం ట్రయల్‌ మెథడ్‌లో 15 కిమీ పరిధిలో మూడు 5 కి.మీ పాత్‌లు ఉపయోగిస్తారు. అడవిలోని పాదముద్రలు, వాగుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అదనంగా, ప్రతి 400 మీ. వద్ద వృక్షజాతులు, గుల్మలు, పొదలు, కలుపు మొక్కలు, గడ్డి జాతులు, ఎండుగడ్డి, ఖాళీ ప్రదేశాల శాతాన్ని నమోదు చేస్తారు.

60 మంది వలంటీర్లతో గణన..

వన్యప్రాణుల గణన సాహసోపేత కార్యం. జంతువుల నివాస ప్రదేశాల్లో కదలికలు, అవశేషాలు, పాదముద్రలు, మల మూత్రాలు, వెంట్రుకలు సేకరణ అవసరం. శిక్షణ పొందిన నిపుణులు దీన్ని చేయగలరు. ఈ సర్వేలో స్థానిక ప్రజలు, జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులకు అవకాశం కల్పించారు. గత నవంబరు వరకు ఆన్‌లైన్‌ అప్లికేషన్లు స్వీకరించి, అర్హులైన 60 మంది వలంటీర్లను ఎంపిక చేశారు.

జిల్లా అటవీ విస్తీర్ణం..

జిల్లా అటవీ విస్తీర్ణం 1211.18 చ.కి.మీ. (32.43 శాతం). నిర్మల్‌, ఖానాపూర్‌ డివిజన్లు ఉన్నాయి. నిర్మల్‌ డివిజన్‌లో నిర్మల్‌, మామడ, దిమ్మదుర్తి, భైంసా రేంజ్‌లు, ఖానాపూర్‌ డివిజన్‌లో ఖానాపూర్‌, పెంబి, కడెం, ఉడుంపూర్‌, తాండ్ర రేంజ్‌లు ఉన్నాయి. మొత్తం 9 రేంజ్‌లు, 121 బీట్లు ఉన్నాయి. ప్రతీ బీట్‌లో ఇద్దరు లేదా ముగ్గురు బృందాలు. ఒకరు రేంజ్‌ ఆఫీసర్‌ లేదా సెక్షన్‌ ఆఫీసర్‌తో ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ట్రాప్‌ కెమెరాలు కూడా పనిచేస్తాయి. విరుద్ధ దిశలో ఏర్పాటు చేసి జంతు కదలికలు రికార్డు చేస్తాయి.

మొబైల్‌ యాప్‌లో డేటా..

ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో డేటాను ఫొటోలతో అప్‌లోడ్‌ చేస్తారు. ఎదుర్కొన్న జంతువులు, అవశేషాలు, పాదముద్రలు, మల విసర్జనలు, చెట్లపై కాలిగోర్లు, వెంట్రుకలు సేకరించి నమోదు చేస్తారు. యాప్‌లో ఆహార శైలి, ఆరోగ్య పరిస్థితి వంటి వివరాలు జాతీయ వన్యప్రాణి సంస్థ ఆధారంగా లెక్కలు వేసి అధికారిక ప్రకటన చేస్తారు.

అడవిలో ఇన్‌స్పెక్షన్‌ చేస్తున్న అటవీ అధికారులు

వన్యప్రాణుల వృద్ధికి కీలకం

జిల్లాలో ప్రస్తుత జంతువుల వివరాలు, ఆహార శైలి, ఆరోగ్య పరిస్థితిలను అంచనా వేసేందుకు సర్వే అత్యంత కీలకం. దీని ఆధారంగా వన్యప్రాణుల రక్షణ అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఏ జంతువుల సంఖ్య పెరుగుతుందో అంచనా వేయొచ్చు. ఈసారి సర్వేలో వలంటీర్లుగా స్టూడెంట్స్‌, పర్యావరణ, జంతు ప్రేమికులు పాల్గొంటారు.

– సుశాంత్‌ సుఖదేవ్‌ బోబడే, డీఎఫ్‌వో

నిర్మల్‌1
1/3

నిర్మల్‌

నిర్మల్‌2
2/3

నిర్మల్‌

నిర్మల్‌3
3/3

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement