ప్రారంభమైన నిర్మల్ ఉత్సవాలు
చిన్నారుల
సాంస్కృతిక ప్రదర్శన
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలో సందడి మొదలైంది. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ ఉత్సవాలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాల్లో 45 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
చిన్నారుల నృత్య ప్రదర్శన..
ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు నిర్మల్ చరిత్రను తెలిసేలా నృత్యాలు ప్రదర్శించారు. పలు పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
నోరూరిస్తున్న రుచులు..
ఇందిర మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డూ, మక్క వడలు పట్టణ ప్రజలు నోరూరిస్తున్నాయి. స్థానిక వ్యాపారులు కూడా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు తినుబండారాలు రుచి చూశారు.
ప్రారంభమైన నిర్మల్ ఉత్సవాలు


