నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలి
● హౌసింగ్ పీడీ రాజేశ్వర్
లక్ష్మణచాంద: నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని హౌసింగ్ పీడీ రాజేశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శనివారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, ప్రమాణాలు పాటించాలన్నారు. ఇంటి స్లాబ్ ఏరియా 800 స్క్వేర్ ఫీట్లకు మించరాదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాధ,ఎంపీవో నసీరుద్దీన్, సర్పంచ్ ఓస కవిత, న్యూ కంజర్ సర్పంచ్ మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


