ట్రిపుల్ ఐటీలో వీర్ బాల దివస్
బాసర: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు బాసర ఆర్జీయూకేటీలో వీర్ బాల దివస్ వేడుకలు శుక్రవారం ఘనంగా మొదలయ్యాయి. వేడుకల్లో భాగంగా దేశ నిర్మాణంలో విద్యార్థుల సృజనాత్మకత, బాధ్యత, సామర్థ్యాన్ని చాటేందుకు వ్యాసరచన, వక్తృత్వం, చర్చాగోష్టి, క్విజ్, కవితల పోటీలు నిర్వహించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ వీర్ బాల దివస్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ విఠల్, ఎస్.శేఖర్, దిల్ బహార్, సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.రాములు, డాక్టర్ కాశన్న, శ్యామ్‌బాబు, నాగలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.


