ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్
బాసర: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు ఆర్థికసాయం అందించే ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్‌నకు బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వీహెచ్.సాయి మైథిలి ఎంపికై ంది. ఈ స్కాలర్‌షిప్ 10వ/12వ తరగతిలో మంచి మార్కులు సాధించి, తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న వారికి లభిస్తుంది. ఎల్‌ఐసీ ఉపకార వేతనానికి ఎంపికై న సాయి మైథిలిని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఎస్.విఠల్, హిమబిందు, వినోద్ పాల్గొన్నారు.
విద్యార్థిని అభినందిస్తున్న ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్


