116 రోజులు 3.5 టీఎంసీల నీళ్లు
లక్ష్మణచాంద: వ్యవసాయ జిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాకు సాగు, తాగునీటికి వర ప్రదాయినిగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన సరస్వతి కాలువ ఉంది. ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు ఈనెల 24 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
వారబందీ పద్ధతిలో..
సరస్వతి కాలువ ద్వారా నిర్మల్‌రూరల్, సోన్, లక్ష్మ ణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, దస్తురాబా ద్ మండలాలకు తాగు, సాగునీరు అందుతుంది. రెండో పంటకు వారబందీ పద్ధతిలో నీటిని విడుద ల చేస్తున్నారు. 8 రోజులు నీటిని విడుదల చేసి.. ఏడు రోజులు నిలిపివేయనున్నారు.
3.5 టీఎంసీలు...
జిల్లాలోని ఏడు మండలాలకు సరస్వతి కాలువ ద్వారా రెండో పంటకు నిత్యం 300 క్యూసెక్కుల నీ టిని విడుదల చేస్తున్నారు. ఇలా ఈనెల 24 నుంచి విడుదలవుతున్న నీరు ఏప్రిల్ 18 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 116 రోజులు 3.5 టీఎంసీల నీటిని సరస్వతి కాలువ ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు విడుదల చెయనున్నారు.
33,622 ఎకరాల ఆయకట్టు...
జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల పరిధిలో మొ త్తం సరస్వతి కాలువ కింద 33,622 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో యాసంగికి సరస్వతి కాలువ ద్వారా మీరు విడుదలవుతున్న నేపథ్యంలో 33,622 ఆయకట్టుకు సాగుకానుంది. అలాగే సరస్వతి కా లువ ద్వారా మండలంలోని వడ్యాల్ వద్ద ఎస్కేప్ కెనాల్ ద్వారా కనకాపూర్ వాగులోకి నీటిని విడుద ల చేసి సదర్మాట్‌కు తరలిస్తారు. దీనికింద మరో 13 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.


