అడవుల సంరక్షణ అందరి బాధ్యత
సారంగపూర్: అడవులను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని ఎఫ్‌ఆర్‌వో రామకృష్ణారావు అన్నారు. అడవి మధ్యలో ఉన్న మండలంలోని పెండల్‌ధరి గ్రామంలో అడవులు, అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రభావం అనే విషయంపై ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. అనంతరం గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ అడవుల్లో అగ్ని ప్రమాదాలకు పరోక్షంగా ప్రజలే కారణమన్నారు. బీడీలు, సిగరెట్లు కాల్చి వాటిని ఆర్పివేయకుండా పడేయడంతో అగ్ని ప్రమాదాలు సంభవించి దట్టమైన అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయని తెలిపారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు వ్యర్థాలకు నిప్పు పెట్టడం కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో నజీర్‌ఖాన్, ఎఫ్‌ఎస్‌వో రషీద్, ఎఫ్‌బీవోలు వెన్నెల, సుజాత తదితరులు ఉన్నారు.


