పండరీపూర్‌కు బయల్దేరిన బస్సు
నిర్మల్‌టౌన్: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి గురుద్వారా, పండరీపూర్, తుల్జాభవాని ఆలయం వరకు ప్రత్యేక బస్సు బుధవారం బయల్దేరింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పండరి బస్సుకు పూజ చేసి ప్రారంభించారు. మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి నాందేడ్‌లోని గురుద్వార్ చేరుకొని, తెల్లవారు జామున పండరీపూర్‌కు చేరుకుంటుంది. అక్కడ విఠలేశ్వరుని దర్శించుకుని, అదే రోజు తుల్జ్జాభవాని అమ్మవారిని దర్శనం చేసుకుని, మరుసటి రోజు నిర్మల్ చేరుకుంటుంది.
జనవరి 1న శబరిమలకు బస్సు
నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి శబరిమలకు జనవరి 1న సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి బుధవారం తెలిపారు. ఈ బస్సు అరుణాచలం, పలని, శబరిమల, మధురై వరకు వెళ్తుందని పేర్కొన్నారు. మొత్తం ఈ టూర్ ఆరు రోజులు ఉంటుందని, ఒకరికి టికెట్ రూ.7,250గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


