నడిపించిన అభిమానం
భైంసారూరల్: ఎన్నికల్లో ఎవరైనా తమ నాయకుడు గెలవాలని ప్రచారం చేయడం, ఓటర్లను మభ్యపెట్టడం మాములే. కానీ తమ నాయకుడు గెలిస్తే మీ చెంతకు పాదయాత్రగా వస్తానని దేవుళ్లను మొక్కుకునే అభిమానులు కొందరే ఉంటారు. భైంసా రూరల్ మండలం మహాగాంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు అభ్యర్థి రాజ్యలక్ష్మి గెలవాలని అనుచరులు, అభిమానులు అయ్యప్పను వేడుకున్నారు. ఫలితం దక్కడంతో సర్పంచు రాజ్యలక్ష్మి భర్త రాకేశ్‌కు విషయం చెప్పారు. దీంతో బుధవారం యువకులతోపాటు గ్రామస్తులు మహాగాం నుంచి ఏడు కిలోమీటర్లు పాదయాత్రగా భైంసాలోని అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. అయ్యప్ప స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.


