● జనవరి నుంచి విడుదలకు ప్రణాళిక ● ఖానాపూర్ ఎమ్మెల్యే బ
యాసంగి పంటలకు కడెం నీరు
కడెం: యాసంగి పంటలకు కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. కడెంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆయకట్టు రైతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాల రైతులతో చర్చించారు. జనవరి మొదటి వారంలో యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రేపు ‘రబతుకంతా
బాల్యమే’ ఆవిష్కరణ
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖకవి, రచయిత చట్ల గజ్జరాం రచించిన ‘బ్రతుకంతా బాల్యమే(వచనకావ్యం)’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈనెల 25న(గురువారం) నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపుకిషన్ చేతులమీదుగా పుస్తకం ఆవిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. విశిష్ట అతిథులుగా జిల్లాకు చెందిన సాహితీవేత్తలు అప్పాల చక్రధారి, దామెర రాములు, తుమ్మల దేవరావు తదితరులు హాజరవుతారని వివరించారు. కార్యక్రమానికి జిల్లాలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలు హాజరు కావాలని కోరారు.
ఈ–ఆఫీస్‌పై శిక్షణ
భైంసాటౌన్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులకు ఈ–ఆఫీస్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ఈ–విభాగం అధికారి మీర్జా షీఫీ మున్సిపల్ అధికారులు, ఉద్యోగులకు ఆయా విభాగాల పోర్టల్‌లు, వాటి వినియోగం, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఈ సంతోష్, టీపీవో అనురాధ, ఉద్యోగులు పాల్గొన్నారు.


