చిట్టిపొట్టి రైతులు..
జాతీయ రైతు దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చిన్నారులు రైతు వేషధారణలో వేడుకల్లో పాల్గొన్నారు. లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌లో విద్యార్థులు ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. మొక్కజొన్నలో కలుపు తీశారు. పంటకు నీరు పెట్టారు. మందు చల్లారు. ఖానాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కూడా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. మస్కాపూర్ గ్రామంలోని విద్యార్థుల రైతు వేషధారణలో ఆకట్టుకున్నారు. – లక్ష్మణచాంద/ఖానాపూర్
చిట్టిపొట్టి రైతులు..
చిట్టిపొట్టి రైతులు..


