ఆస్పిరేషన్ బ్లాక్‌ను సందర్శించిన సీపీవో
పెంబి: జిల్లాలోని ఆస్పిరేషన్ బ్లాక్ అయిన పెంబి మండలంలోని పలు గ్రామాలను మంగళవారం నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ ప్రత్యేక అధికారి శిల్పారావు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ ఆహ్మద్‌తో కలిసి సందర్శించారు. నాగాపూర్, పెంబి, మందపల్లి, కోసగుట్ట, షెట్‌పల్లి, జంగుగూడ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. మందపల్లిలోని కేజీబీవీలో విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, భోజనం, మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా శిల్పారావు మాట్లాడుతూ.. ఆస్పిరేషన్ బ్లాక్‌తో పెంబి మండలం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళా సంఘాలతో ముఖాముఖి చర్చించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఆయిల్‌పాం క్షేత్రం, ఫార్మర్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఎస్టీ సంక్షేమ అధి కారి అంబాజీ, డీఈవో భోజన్న, ఎంపీడీవో సుధాకర్, ఐకేపీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.


