కడెం.. సరికొత్త రికార్డు
కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్టు. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్‌లోనూ పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతోంది. గత ఐదేళ్లలో డిసెంబర్‌లో ఈ స్థాయిలో నీటిమట్టం లేదు. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌ఎల్ (700 అడుగులు) చేరింది. సాగు నీటి ప్రణాళిక సిద్ధం కాకముందే ఆయకట్టు రైతులు యాసంగి పంటలకు సిద్ధమవుతున్నారు.
రికార్డుస్థాయి నీటి మట్టం..
గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కడెం ప్రాజె క్టు రికార్డు స్థాయి నీటిమట్టం కలిగి ఉంది. రాష్ట్ర ప్ర భుత్వం రూ.9.26 కోట్లతో మరమ్మతులు చేయించడం, గేట్ల లీకేజీలను అరికట్టడం, అధికారులు, ఇంజినీర్ల కృషితో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం మెయింటేన్ అవుతోంది.
రేపు నీటివిడుదలపై సమావేశం
కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు యాసంగి సాగునీటి విడుదలపై ఈనెల 23న, కడెం ఆయకట్టుకు రైతాంగంతో ఇరిగేషన్ అధికారులు సమావేశం నిర్వహించారు. రైతులతో చర్చించి ఆయకట్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.
గత పదేళ్లలో డిసెంబర్‌లో కడెం నీటిమట్టం వివరాలు..
సంవత్సరం నీటిమట్టం
2016 693.750
2017 687.650
2018 682.425
2019 699.075
2020 696.450
2021 698.925
2022 695.400
2023 683.700
2024 695.175
2025 700
కడెం ప్రాజెక్ట్:


