అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలుచేసి మొక్కులు చెల్లించుకున్నారు. నిజమాబాద్ జిల్లా పెర్కిట్ నుంచి వచ్చిన హనుమాన్ భజనమండలి సభ్యులు ఆలయ మండపంలో ప్రత్యేక భజన నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శానికి తీసుకెళ్లారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇన్‌చార్జి ఈవో భూమయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌ను
సన్మానిస్తున్న ఆలయ సిబ్బంది
ఆలయ మండపంలో ఎమ్మెల్యే దంపతులు
అడెల్లిలో భక్తుల సందడి


