ఆరోగ్య చైతన్యంతో ఫిట్ ఇండియా
నిర్మల్‌ఖిల్లా: ప్రతి వ్యక్తికి ఆరోగ్య చైతన్య అవసరమ ని తద్వారా ఆరోగ్య భారతం ఏర్పడి ‘ఫిట్ ఇండి యా’ కార్యక్రమం విజయవంతమవుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి బి.శ్రీకాంత్‌రెడ్డి అ న్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం స్పో ర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ అనుమతితో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక శాఖ అధికారి నర్సింహారెడ్డి, నిర్మల్ సైకిల్ క్లబ్ సభ్యులు డాక్టర్ బీఎల్‌ఎన్.రెడ్డి, డాక్టర్ రఘునందన్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు భోజన్న, రాకేశ్‌రెడ్డి, భిక్షపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.


