సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
ఖానాపూర్: నిర్మల్ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపా టు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం తదితర విషయాలపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తదితరులను డీసీ సీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటే ల్ ఆదివారం వేర్వేరుగా కలిశారు. అటవీ సమస్యలు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి డీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుని సమష్టిగా ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు తెలిపారు. గెలుపోటముల కారణాలను విశ్లేషించి, భవిష్యత్ వ్యూహరచన చేయాలని పేర్కొన్నారు. నాగోబా జాతర ఏర్పాట్లను సీఎంకు వివరించడంతోపాటు జాతర ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అదనపు నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. ఇందుకు రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
భట్టి విక్రమార్కను సన్మానిస్తున్న ఎమ్మెల్యే
సీఎంకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే బొజ్జు
సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు


